ఈ విషయాన్ని ఆమె మనుమడు అలెక్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే హాలీవుడ్ ప్రముఖులు శనివారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. హిలరి ముఖేల్ రీవ్స్ హార్రర్ చిత్రం విచ్ ఫైండర్‌తో సినీరంగ ప్రవేశం చేశారు. ఈమె 1960, 1970 దశకాల్లో పలు సినిమాల్లో నటించారు.
ఆ తర్వాత 1990ల్లో ఆమె సినిమా నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. నిల్ బై మౌత్, యాన్ ఆవ్‌ఫుల్లీ అడ్వెంచర్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. సినిమారంగంలోకి రాకముందు హిల్లరీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ తర్వాత వివిధ ఆస్పత్రుల్లో అడిక్షన్ కౌన్సెలర్‌గా విధులు నిర్వహించారు.