రాగి పాత్రల్లో భోజనం చేస్తే...

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (14:02 IST)
పూర్వకాలంలో మన పెద్దలు రాగిపాత్రల్లో ఆహారాన్ని భుజించేవారు. రాగి చెంబులు, గ్లాసుల్లో నీటిని తాగేవారు. ఆ రాగి చెంబులు, గ్లాసులు, అన్నం ప్లేట్లు ఇపుడు కంటికి కూడా కనిపించడం లేదు. దీనికి కారణం నానాటికీ మారిపోతున్న జీవనవిధానమే.
 
* అప్పట్లో రాగి పాత్రల్లో భోజన చేయడానికి కారణాలు లేకపోలేదు. రాగి, ఇత్తడి పాత్రలు వాడడం వలనే వారి ఆరోగ్యం భేషుగ్గా ఉండేదట.
* రాగి పాత్రలో 3 గంట‌ల పాటు నీటిని నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలోని క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. 
* ఇత్త‌డి పాత్ర‌ల‌ను జింక్‌, అలాయ్ మిశ్ర‌మంతో త‌యారు చేస్తారు. జింక్ వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 
* రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. 
* అధిక బ‌రువు సమస్య త‌గ్గిపోతుంది. గుండె స‌మ‌స్య‌లు రావు. క్యాన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. 
* థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుంది. 
* అలాగే, ఇత్తడి పాత్రల్లో నీటిని తాగొచ్చు. ఆ పాత్రల్లో చేసిన వంట చేసుకుని ఆరగించడం చాలా మంచిది. 
* అందుకే పెద్దలు అంత ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ రోజులు జీవించారని నిపుణులు చెబుతున్నారు. 
* సో.. ఇప్పటికైనా రాగి, ఇత్తడి పాత్రలు వాడడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని వారు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు