గంగా తీర్థం ఎన్నేళ్లైనా చెడిపోదట.. గంగమ్మ పుట్టిన ప్రాంతం పేరేంటంటే?
మంగళవారం, 24 జులై 2018 (12:01 IST)
గంగానది పరమ పవిత్రమైనది. గంగానది నీటిని ఓ రాగి చెంబులోకి తీసుకుని ఆ పాత్రను బాగా మూతపెట్టి వుంచితే ఎన్ని సంవత్సరాలైనా ఆ నీరు చెడకుండా అలానే వుంటుందని విశ్వాసం. అలాగే గంగానదిలో స్నానం చేస్తే.. పుట్టిన క్షణం నుంచి చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. మృతిచెందిన వారిని భస్మాన్ని గంగలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం.
ఇక గంగానది ఎక్కడ నుంచి పుట్టిందంటే.. హిమాలయాల్లోని కోముకి అనే ప్రాంతం నుంచి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ఈ ప్రాంతాన్ని అంత సులభంగా చూడలేం. గంగానదిని పరమపవిత్రంగా భావించడంతో రోజూ సాయంత్రం పూట గంగా హారతి ఇస్తారు. గంగానదిలో స్నానమాచరించలేని వారు.. ఇంట్లో స్నానమాచరించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా గంగమ్మ నదిలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది.
అదేంటంటే..?
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంశ తైరపి
ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణు లోకం సగచ్ఛతి ||
అంబుత్వర దర్శనాన్ముక్తిహి నజానే స్నానజం ఫలం
స్వర్గారోహణ సోపనే మహా పుణ్య తరంగిణి
యో2సౌ సర్వగతో విష్ణుః చిత్‍స్వరూపీ నిరంజనః
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః
త్వం రాజా సర్వ తీర్దానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహి మే తీర్ధం సర్వ పాపాపనుత్తయే
నందినీ నళినీ సీతా మాలినీచ మహాపగా
విష్ణు పాదాబ్జ సంభూతాం గంగా త్రిపధగామినీ
భాగీరధీ భాగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నాన కాలే పటేన్నిత్యం మహాపాతక నాశనం
మణికర్ణిక మణికర్ణిక మణికర్ణిక
ఈ మంత్రాన్ని పఠించి ఇంటనే స్నానం చేసే వారికి పాపాలు హరించుకుపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.