మరి దీనికి వైద్యం ఎలా అంటారా... ఇంకేముందు. ఇంట్లో ఉండనే ఉందిగా వెల్లుల్లి. వెల్లుల్లిపాయ రసం తీసి మూడు చుక్కలు చొప్పున రెండు చెవుల్లో వేస్తే సరి. అది లేదంటారా పండు జిల్లేడు ఆకులను వేడిచేసి, నులిపి, అందులో నుంచి వచ్చే రసం మూడు నాలుగు చుక్కలు చెవిలో వేయవచ్చు.
అది కూడా కుదరకపోతే బాదం పప్పు నూనెను మూడు నాలుగు చుక్కలు వేసి, చెవిలో దూది పెట్టాలి. అంతే చెవినొప్పి, చెవిలో పోటు టక్కున మాయమవుతుంది.