ఈ 4 చిట్కాలు పాటిస్తే.. నీరసం తగ్గుతుంది...

మంగళవారం, 30 అక్టోబరు 2018 (10:53 IST)
సాధారణంగా కొంతమంది ఎప్పుడు చూసినా నీరసంగా, అలసటగా కనిపిస్తుంటారు. ఎందువలనంటే.. అనారోగ్యం, పౌష్టికాహారలోపం, పని ఒత్తిడి వంటి కారణాలుండొచ్చు. రోజంతా ఇలా గడపడం చిరాకుగా ఉంటుంది. కనుక ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండానికి ఇలా చేస్తే చాలు.. మంచి ఉపశమనం లభిస్తుంది.. అవేంటో తెలుసుకుందాం..
 
1. ప్రతిరోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. దాంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ఆహార పదార్థాలు తీసుకునే విషయంలో కొవ్వు అధికంగా ఉండే వాటిని తినకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే అలసట తొలగిపోతుంది.    
 
2. రోజూ గ్లాస్ నిమ్మరసంతో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. 
 
3. నిద్రలేమి వలన నీరసంగా, అలసటగా ఉంటారు. నిద్రమనకు చాలా ముఖ్యం.. కనుక రాత్రివేళలో పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చక్కెర కలిపి సేవిస్తే చక్కని నిద్రపడుతుంది. తద్వారా నిద్రేలేమి సమస్యను నివారించవచ్చును. 
 
4. శరీరంలో రక్తం లేని వలన కూడా నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన రక్తసరఫరా మెరుగుపడుతుంది.    

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు