వేసవికాలంలో అయితే మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఊబకాయులకైతే ఈ సమస్య నిరంతరం ఉంటూనే ఉంటుంది. ప్రధానంగా మహిళలకు, కొంత మంది పురుషులకు కూడా ఈ తరహా సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అయితే చాలామంది మంది దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు, సూచనలు పాటిస్తే పాటిస్తే. వీటి నుంచి బయట పడే అవకాశాలు ఉన్నాయి.
మంట, దురదగా ఉన్న తొడ భాగాల్లో కొద్దిగా కొబ్బరినూనెను రాయడం వల్ల సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీరు, కొన్ని చుక్కల లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తొడలు రాసుకునే చోట అప్లై చేయాలి. 5 నిమిషాలు ఆగాక వేడినీటితో కడిగేయాలి. దీని వల్ల మంట, దురద వంటివి తగ్గి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే, ఒక చిన్నపాటి పలుచని టవల్లో కొన్ని ఐస్ ముక్కలు వేసి ఆ టవల్‌ని చుట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నిమిషాల పాటు ఉంచాలి. కొంతసేపు ఆగిన తర్వాత మళ్లీ అలాగే చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ముఖానికి పూసుకునే టాల్కం పౌడర్, రోల్ ఆన్ డియోస్ వంటి వాటిని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. మంట, దురద కూడా తగ్గుతాయి. బయటికి వెళ్తున్నప్పుడు వీటిని వాడటం వల్ల ఫలితం ఇంకా బావుంటుంది.