నాగ చైతన్య 'తండేల్' విజయం తర్వాత మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. బోల్డ్ ఛాయిసెస్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆదరగొట్టె నాగచైతన్య, తన తొలి సూపర్ నేచురల్ థ్రిల్లర్ విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో సినిమా చేయబోతున్నారు. వీరిద్దరూ కలసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ని చేయబోతున్నారు. NC24 ఈ జానర్ ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు, బాపినీడు సమర్పిస్తున్నారు.