జామ చెట్టు ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులు జలుబు, దగ్గు, శ్లేష్మం నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకులతో చేసిన టీ తాగితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నిరోధించగలదు. ఇంకా జామ ఆకులు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
	 
	దగ్గు నుండి ఉపశమనం కోసం జామ ఆకులతో చేసిన డికాషన్ తీసుకోవాలి.
	జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి అల్లం, ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, బెల్లం వేసి కషాయం చేయాలి.
	బెల్లం, గోరువెచ్చని నీటితో జామ ఆకుల పొడిని తీసుకోండి.
	జామ ఆకు టీలో బెల్లం కలిపి తాగితే జలుబుకి ఉపశమనం కలుగుతుంది.
	జామ ఆకుల పొడిని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.
	గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.