మరాటీ మొగ్గతో నిద్రలేమికి చెక్..!

మంగళవారం, 17 మార్చి 2015 (18:44 IST)
నేటి హాడావిడి ప్రపంచంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కాలంతో పోటీపడుతూ పరుగులు తీస్తున్నారు. తద్వారా ఏర్పడే ప్రాధమిక సమస్య నిద్రలేమి. రోజంతా టార్గెట్‌లతో పోరాడే ఉద్యోగులు, పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు, ఇంటి పనులతో అలసిపోయే గృహిణులు సైతం రాత్రి వేళల్లో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. 
 
అటువంటి వారు ఇంటిలో లభించే వంటింటి వస్తువులతోనే ఉపశమనం పొందవచ్చు. మరాటీ మొగ్గలతో నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. మరాటీ మొగ్గలను పొడిని పాలలో కలిపుకుని ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు సేవించినట్లైతే సుఖంగా నిద్రపడుతుంది. 
 
అదేవిధంగా రుచికరమైన ఖర్జూరం గింజలు నీటితో అరగదీసి ఆ గంధంలో కొంచెం తేనె కలిపి మూడు చుక్కలు కంటిలో వేసుకుని పడుకుంటే బాగా నిద్ర వస్తుంది. ఇంకా వెలగవేరు గంధం కంటి రెప్పలపై పూసినా కూడా సుఖంగా నిద్ర కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి