పాలకూరతో అన్ని ప్రయోజనాలున్నాయా?

గురువారం, 27 జులై 2023 (21:32 IST)
ఆకు కూరలంటే చాలామంది తేలిగ్గా తీసేస్తుంటారు. కానీ వాటిలో కావల్సినన్న పోషకాలుంటాయి. పాలకూర తీసుకుంటే మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచడం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము. రక్తహీనత లేదా అనీమియాతో బాధపడే వారికి పాలకూర మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

పాలకూరను రసంలా తీసి అందులో కాస్త అల్లం, నిమ్మరసం చేర్చి తీసుకుంటే అధిక బరువు కంట్రోల్ అవుతుంది. పాలకూరను ఉడికించుకుని ఆ రసంలో కొద్దిగా ఉప్పు, కూరగాయలు వేసి సూప్‌లా చేసుకుని తాగవచ్చు. కిడ్నీ స్టోన్స్ సమస్య వున్నవారు పాలకూరను తీసుకోరాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు