ఆకాకర కాయలు. చూసేందుకు కాకర కాయల్లా వున్నప్పటికీ చిన్నవిగా గుండ్రంగా వుంటాయి ఇవి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. వీటిని తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన మన ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము. ఆకాకర కాయలు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి.
గర్భిణులకు ఇవి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫొలేట్‌లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతాయి. మధుమేహంతో బాధపడే వారికి ఆకాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిల్ని పెంచుతుంది. ఆకాకరలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.