అన్ని కాలాల్లో లభించేది నిమ్మకాయ. ఇది పిడికెడంత కూడా ఉండదు. అలాంటి నిమ్మకాయ ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతాకాదు. వంటలు, స్కిన్ కేర్, రిఫ్రెషింగ్ డ్రింక్స్, గార్నిషింగ్ ఇలా ఏదో ఒక రూపంలో నిమ్మకాయ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో వేసవి తాపా(డీహైడ్రేషన్)న్ని నివారించే దివ్యౌషధం నిమ్మకాయలు. డీహైడ్రేషన్‌కు గురైనవారు నిమ్మరసం తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే శక్తి కూడా నిమ్మరసానికి ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో నిమ్మకాయలు నిల్వవుంటాయి. అయితే నిమ్మకాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయడం, చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
నిల్వ చేయడానికి నిమ్మకాయలు కొనుగోలు చేస్తే మాత్రం వాటిని శుభ్రంగా, మచ్చలులేనివిగా చూసి కొనుగోలు చేయాలి. ఒకవేళ నిమ్మకాయపై మరక లేదా మచ్చ కనిపిస్తే వాటిని తొలగించాలి. ఎందుకంటే వీటివల్లే నిమ్మకాయ త్వరగా చెడిపోతుంది. ఎల్లపుడు నిల్వ కోసం తాజా నిమ్మకాయలనే కొనాలి. అపుడే అవి నెలల తరబడి నిల్వవుంటాయి.