పుచ్చకాయ. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పుచ్చకాయ తింటే మగవారిలో కొత్త శక్తి సంతరించుకుని చురుకుగా వుంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. పుచ్చకాయలో వున్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పుచ్చకాయ తింటుంటే మగవారిలో నూతన శక్తి సంతరించుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పుచ్చకాయ రసంలో కాస్తంత తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు పుచ్చకాయ తింటుంటే సమస్య తగ్గుతుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
పుచ్చకాయ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది. పుచ్చపండు గింజల్లో మెగ్నీషియం ఉంటుంది, ఈ మూలకం గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గిస్తుంది.