శరీరానికి అవసరమైన ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది.
పుచ్చకాయ రసంలో కాస్తంత తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది.
మలబద్ధకం ఉన్నవారు పుచ్చకాయ తింటుంటే సమస్య తగ్గుతుంది.
మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
పుచ్చపండు గింజల్లో మెగ్నీషియం ఉంటుంది, ఈ మూలకం గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గిస్తుంది.