కులశేఖర అవుట్: మహేల జయవర్ధనే సూపర్ సెంచరీ!

ముంబై వాఖండే స్టేడియంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫైనల్ పోరులో మహేల జయవర్ధనే సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. 85 బంతులాడిన జయవర్ధనే 13 ఫోర్లతో వంద పరుగులు సాధించాడు. తద్వారా తన ప్రపంచకప్ కెరీర్‌లో రెండో శతకాన్ని, వన్డే కెరీర్‌లో 14వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

అయితే జయవర్ధనేకు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన కులశేఖర 32 పరుగుల వద్ద రనౌటయ్యాడు. 30 బంతులాడిన కులశేఖర ఒక ఫోర్‌తో 32 పరుగుల సాధించాడు.

అంతకుముందు తరంగ (2), దిల్షాన్ (33), సంగక్కర (48), సమరవీర (21) లు భారత బౌలర్ల ధాటికి పెవిలియన్ ముఖం పట్టారు. ప్రస్తుతం జయవర్ధనే (102), పెరెరా (2)లు క్రీజులో ఉన్నారు.

ఫలితంగా 48.4 ఓవర్లలో శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా, భజ్జీ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

వెబ్దునియా పై చదవండి