ఎగ్ టాకోను ఎలా తయారు చేస్తారు?

File
FILE
కోడిగుడ్డు టాకోను ఎలా తయారు చేస్తారన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం. దీని తయారీకి ఒక కోడిగుడ్డు, రెండు చపాతీలు, బ్రెడ్ ముక్కలు రెండు, కాలిఫ్లవర్ ముక్కలు ఒక కప్పు, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, నాలుగు టీ స్పూన్ల నూనె, చిటికెడు ధనియాల పొడిని ముందుగా సిద్ధం చేసి ఉంచుకోవాలి.

ఎలా తయారు చేస్తారు?
ముందుగా మూకుడులో రెండు చెంచెల నూనె వేసి కాలిఫ్లవర్ వేయించాలి. మిగిలిన నూనెలో బ్రెడ్ ముక్కలు వేయించాలి. తర్వాత వాటి మీద కోడి గుడ్డును ఉడకనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత కారం, ఉప్పు ధనియాల పొడి వేసి దించాలి. దీనిని చపాతి మధ్యలో కూరపెట్టి కింది వైపు మడిచి రోల్ చేస్తే సరి. అదే ఎగ్ టాకో. దీన్ని వేడిమీద ఆరగిస్తే సూపర్బ్‌గా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి