పెసర, కీరదోస స్పెషల్

కావలసిన పదార్థాలు :
పెసరపప్పు... అర కేజీ
కొబ్బరి... ఒక కాయ
ఉల్లిపాయలు... పావు కేజీ
కొత్తిమీర... రెండు కట్టలు
మిరియాలపొడి... అర టీ.
కీరదోసకాయలు... అర కేజీ
పచ్చిమిర్చి... ఎనిమిది
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
పెసరపప్పును నానబెట్టాలి. కొబ్బరిని తురమాలి. ఉల్లిపాయలు, కీరాదోసకాయలు, పచ్చిమిర్చిలను సన్నగా తరగాలి. కొత్తిమీరను కూడా సన్నగా తురమాలి. ఇప్పుడు పెసరపప్పులో కొబ్బరితురుము, తరిగిన ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపితే పెసర కీరదోస స్పెషల్ రెడీ అయినట్లే...!

వెబ్దునియా పై చదవండి