సాధారణంగా మనం చింతపండు, నిమ్మకాయలతో పులిహోర చేసుకుంటూ ఉంటాం. కేవలం ఇవే కాకుండా మామిడి తురుముతో కూడా పులిహోర తయారుచేసుకోవచ్చు. ఇది తినటానికి రుచిగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో సి విటమిన్
తయారుచేసే విధానం..
బియ్యం ఉడికించి ప్లేటులో ఆరనివ్వాలి. టీ స్పూన్ నూనెలో పసుపు వేసి కలపాలి. విడిగా ఓ బాణాలిలో నూనె వేసి శెనగపప్పు, మినపప్పు,ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఆవాలు వేసి వేయించి పోపు చేయాలి. అవి వేగాక పల్లీలు, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే మామిడికాయ తురుము వేసి కలిపి వెంటనే దించేసి అన్నం మిశ్రమంలో కలిపితే మామిడికాయ పులిహోర రెడీ.