పిల్లలకు స్నాక్స్ వెరైటీగా చేయాలనుకుంటున్నారా.. అయితే ఉప్మాతో బేల్ పూరీని ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు : బొంబాయి రవ్వ - రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు పచ్చిమిరపకాయలు - మూడు కరివేపాకు - ఒక రెబ్బ అల్లం తురుము - రెండు టీ స్పూన్లు జీలకర్ర - ఒక టీ స్పూను ఆవాలు - ఒక టీ స్పూను కారం పూస - అర కప్పు వేగించిన పుట్నాలు - ఒక టేబుల్ స్పూను వేగించిన పల్లీలు - పావు కప్పు
తయారు చేయు విధానం : ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి సరపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము వేసి వేగించి నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. సరిపడా ఉప్పు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి నాలుగు సార్లు గరిటెతో కలిపి దించేయాలి. ఒక పళ్లెంలో ఈ ఉప్మాని వెడల్పుగా వేసి దానిపై కారప్పూస, బూందీ, వేగించిన అటుకులు, వేగించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వీటితో కలిపి తినే ఈ ఉప్మాచాలా రుచిగా ఉంటుంది.