కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ తరుగు: రెండు కప్పులు వెల్లుల్లి: నాలుగు రెబ్బలు టమోటా జ్యూస్: రెండు టేబుల్ స్పూన్లు పంచదార: ఒక టేబుల్ స్పూన్ ఉప్పు , మిరియాల పొడి: తగినంత బటర్ రెండు: టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: వేడయిన బాణలిలో నూనెను పోసి నూనె వేడయ్యాక ఉల్లిపాయల తరుగును చేర్చి వేయించండి. వెల్లుల్లి తరుగులను అందులో వేసి వేయించండి. నూనెలో కంటే వెన్నతో వేయిస్తే సూప్ రుచికరంగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేగాక అందులో టమోటా జ్యూస్‌ను ఉప్పు, మిరియాల పొడి, పంచదారలను కలిపి పావుశేరు నీటిని కలపండి. ఐదు నిమిషాల పాటు ఉడికాక సూప్‌ను దించి వేడివేడిగా కొత్తిమీర తరుగుల్ని చల్లి సర్వ్ చేయండి.