కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు: మూడు చిలకడదుంపలు: నాలుగు కారం: ఒక స్పూన్ ఉప్పు: ఒక స్పూన్ చింతపండు, కొత్తిమీర: చెరో స్పూన్
తయారీ విధానం: తురిమిన చిలకడ దుంపల్లో కారం, ఉప్పు కలిపి 45నిమిషాల పాటు ఊరనివ్వాలి. చింతపండును నానెబెట్టి గుజ్జు తీసి చిలకడదుంప తురుములో కలపండి. ఈ మిశ్రమాన్ని రోట్లో వేసి దంచుకోండి. కావాలంటే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో పోపు వేసి కొత్తిమీర తరుగుల్ని కలిపితే చిలకడదుంప పచ్చడి రెడీ.