కావలసిన పదార్థాలు : బియ్యం... ఒక కిలో టొమాటోలు... అర కిలో చిన్న మెంతికూర... 10 కట్టలు పచ్చిమిర్చి... 8 కారం... ఒక టీ. పసుపు... అర టీ.గరంమసాలా... రెండు గ్రా. ఉల్లిపాయలు... రెండు అల్లం వెల్లుల్లి ముద్ద ... ఒక టీ. డాల్డా లేదా నెయ్యి... వంద గ్రా. ఉప్పు... తగినంత
తయారీ విధానం : బియ్యం కడిగి నానబెట్టాలి. టొమాటోలను చిన్నగా ముక్కలుగా కోసి ఉంచాలి. ఓ గిన్నెలో డాల్డా లేదా నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టి మెంతికూరను వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయలు, గరంమసాలా, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించాలి. తరవాత లీటరు నీళ్లు పోసి మరిగించాలి.
నీళ్లు మరుగుతుండగా బియ్యం, పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి ఉడికించాలి. మూడువంతులు ఉడకగానే సిమ్లో పెట్టి పూర్తిగా ఉడికిన తరవాత దించేయాలి. అంతే టొమోటో మెంతికూర బాత్ అయినట్లే... దీంట్లోకి పెరుగుతో చేసిన ఏ వెరైటీ అయినా చాలా బాగుంటుంది.