బీన్స్ పాలక్ కబాబ్

కావలసిన పదార్థాలు :
బీన్స్‌తురుము... అర కప్పు
పచ్చిబఠాణీలు... అర కప్పు
పాలకూర... రెండు కట్టలు
బంగాళాదుంపలు... రెండు
పనీర్... 50 గ్రా.
పచ్చిమిర్చి... ఒకటి
అల్లంవెల్లుల్లి... అర టీ.
కారం... పావు టీ.
బ్రెడ్‌ పొడి... అర కప్పు
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
కూరగాయలన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి, పొట్టు తీసిన బంగాళాదుంపలను కూడా ఇందులో వేసి ఉడికించి, నీటిని వంపేయాలి. ఇప్పుడు ఈ మొత్తం ముక్కలన్నింటినీ మిక్సీలో వేయాలి. అందులోనే పచ్చిమిర్చి, ఉప్పు, అల్లంవెల్లుల్లి, కారం వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

దీనికి సన్నగా తరిగిన పనీర్‌ను కలిపి... గుండ్రటి వడల్లాగా ఒత్తి, బ్రెడ్‌పొడిలో దొర్లించి... పెనంమీద వేసి, రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే బీన్స్ పాలక్ కబాబ్ సిద్ధమైనట్లే..!

వెబ్దునియా పై చదవండి