వంకాయతో వెరైటీ డిష్ ఎలా చేయాలి?

శుక్రవారం, 8 ఫిబ్రవరి 2013 (17:48 IST)
FILE
కీళ్లనొప్పులకు చెక్ పెట్టే వంకాయతో ఎప్పుడూ కూర, ఫ్రైలతో విసిగిపోయారా.. అయితే మీ పిల్లలకు నచ్చే విధంగా వంకాయతో వెరైటీ డిష్ ఎలా చేయాలో చూద్దామా...?

ఈ వంటకానికి కావాల్సిన పదార్థాలు :
వంకాయలు - రెండు
బ్రెడ్ - స్లైసులు - నాలుగు
నూనె - కొద్దిగా
హోమస్ సాస్ - కప్పు (బజార్లో లభిస్తుంది)
వాల్‌నట్ పలుకులు - కొన్ని
ఆలివ్ నూనె - రెండు చెంచాలు
టమాటాలు - రెండు
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మరసం - రెండుమూడు చెంచాలు

తయారీ విధానం :
వంకాయల్ని రెండుగా కోసి కొద్దిగా నూనె రాసి పదిహేను నిమిషాలపాటు గ్రిల్ చేయాలి. వంకాయముక్కలు మెత్తగా అయ్యాక తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసుల్ని పొడిలా చేసుకుని రెండు చెంచాల నూనె వేయించుకుని పళ్లెంపై పరవాళి. వేగిన వంకాయముక్కల్లో హోమస్ సాస్ రాసి, లోపలి భాగంలో బ్రెడ్ పొడిని అద్ది మళ్లీ మూడు నిమిషాలు గ్రిల్ చేయాలి.

తర్వాత వెడల్పాటి పాన్‌లో వాల్‌నట్ పలుకులు, కొత్తిమీర, టమాటాలు వేయించి నిమ్మరసం, ఆలివ్ నూనె చేర్చి మరోసారి వేయించాలి. ఇలా చేసుకున్న సలాడ్‌ను వంకాయ ముక్కల్లో ఉంచి వడ్డించాలి. అవసరం అనుకుంటే మరికాస్త హోమస్ సాస్ వేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి