కబడ్డీ, కబడ్డీ, కబడ్డీ, కబడ్డీ, కబడ్డీ !!!

Gulzar Ghouse

బుధవారం, 25 మార్చి 2009 (11:53 IST)
కబడ్డీ ముఖ్యంగా భారత దేశానికి చెందిన ఆట. ఇది మన దేశంలో ఎప్పుడు ప్రారంభమైందనేదానికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు. కాని ఇది చాలా పురాతనమైన ఆట. ఈ ఆట కురుక్షేత్ర యుద్ధానికి పూర్వం ప్రారంభమైందంటారు. అర్జునుని కూమారుడు అభిమన్యుడు ఏడుగురు యోధులతో పోరాడాడు. దీనిని చక్రవ్యూహం‌లోని సంఘటనగా అభివర్ణిస్తారు. అభిమన్యుడు ఈ వ్యూహాన్ని ఛేదించడానికి సన్నద్దమవుతుంటాడు. కాని చివరికి చనిపోయాడు.

కబడ్డీలోకూడా ఇరు జట్లలో ఏడుగురు ఆటగాళ్ళుంటారు. మిగిలిన ఐదుగురు రిజర్వులో ఉంటారు. కబడ్డీ ఆట మైదానం 12.5మీటర్ల పొడవు, 10మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనిని రెండు భాగాలుగా విభజిస్తారు. ఆట 20-20 నిమిషాలలో రెండు ఆటలుగావుంటుంది. ప్రత్యర్థి జట్టుపై తలపడే ఆటగాడు గుక్క తిప్పుకోకుండా కబడ్డీ...కబడ్డీ అంటూ ముందుకు దూసుకు పోతాడు.

ఒకే గుక్కలో ప్రత్యర్థి జట్టులో కనీసం వీలైనంతమందిని తాకి రావాలి. ఊపిరి తీసుకునేలోపలే మళ్ళీ తన జట్టులోకి ప్రవేశించాల్సివుంటుంది. ప్రత్యర్థి జట్టులో ఎంతమందిని అతను తాకుతాడో అన్ని పాయింట్లు వారి జట్టుకు వస్తాయి. ఒకవేళ అతను తన ప్రత్యర్థి జట్టుతో తలబడేటప్పుడు అతని శ్వాస అక్కడే ఆపేస్తే అతను తన జట్టులోనుంచి తొలగిపోవాల్సివుంటుంది.

ఏ జట్టుకైతే అత్యధికంగా పాయింట్లు వస్తాయో, ఆ జట్టు గెలుపొందినట్లు. ఈ ఆటను వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియాలలోకూడా ఈ ఆటను ఆడుతుంటారు.

వెబ్దునియా పై చదవండి