గుర్రపు పందేలు: స్టీకర్ల వింత చేష్టలు

FileFILE
అత్యంత సంపన్నుల క్రీడగా గుర్రపు పందేలకు పేరుంది. ఈ పోటీలు రసవత్తవరంగా సాగుతుంటాయి. వీటిని తిలకించేందుకు రాజులు, దేశాధినేతలు, వీవీఐపీలు వంటి ప్రముఖులు సైతం స్టేడియాలకు తరలి వస్తుంటారు. అయితే ఇంగ్లాండ్‌లోని ప్రముఖ వింటర్సన్ స్టేడియంలో జరిగిన గుర్రపు పందేల పోటీలను తిలకించేందుకు ఇంగ్లాండ్ ప్రిన్స్ ఛార్లెస్, హ్యారీ పోర్టర్ నటి ఎమ్మావాసన్ ప్రముఖులు వచ్చాయి.

గుర్రపు స్వారీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అందరూ పోటీల్లో నిమగ్నమై పోయారు. ఆ సమయంలో వంటిపై నూలుపోగు లేకుండా పలువురు స్టీకర్లు మైదానంలోకి దూసుకొచ్చి కలకలం సృష్టించారు.

భద్రతా సిబ్బందిని సైతం తప్పించుకొని మైదానం చుట్టూ పరుగులు తీశారు. దీంతో ఖంగుతిన్న సెక్యూరిటీ వారిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ప్రిన్స్ ఛార్లెస్ ట్రోఫీని అందజేసి నిష్క్రమించారు.

వెబ్దునియా పై చదవండి