గృహసౌందర్యన్ని ఇనుమడింపజేసే హాలు

మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా గృహ నిర్మాణంలో అందమైన హాలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మన సంస్కృతిలో ఇంటికి వచ్చిన వారిని గౌరవించి ఆతిథ్యం ఇవ్వడంలో హాలు కీలక పాత్ర పోషిస్తుంది.

రోజంతా అలసి సొలసి వచ్చిన కుటుంబ సభ్యులు హాలులో సేదదీరుతారు కనుక హాలును అందంగా తీర్చిదిద్దుకోవడంలో కొన్ని మెలుకువలు పాటించడం ఎంతైనా అవసరం. అలాగే టీవి చూడడం, మిత్రులతో మాట్లాడడం వంటివే కాకుండా బిజినెస్ విషయాలు కూడా చర్చించాల్సి ఉంటుంది కాబట్టి దీనిని అందంగా అలంకరించడంలో అశ్రద్ద చేయకూడదు.

హాలులో ఉన్న అన్ని కిటికీలు, తలుపులు తీయడం ద్వారా స్వచ్ఛమైన గాలి వెలుతురు బాగా సోకే అవకాశం ఉంది. అలా లేని పక్షంలో వెలుతురుకై అందమైన విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లను అమర్చాలి. హాలుకు వినియోగించే పెయింట్లు నీలిరంగు, పచ్చరంగులతో కూడి ఉండాలి. ఉద్వేగం, ఉద్రేకం తేచ్చే చిత్రాలు హాలులో ఉండకూడదు.

చేపలతొట్టే ఉంచితే హాలు అందాన్ని సంతరించుకుంటుంది. ఇంకా చెప్పాలంటే హాలు కాంతివంతంగా ప్రతి సమయం ప్రకాశిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలి. హాలు ఆకారానికి తగిన విధంగా ఫర్నిచర్, పూలతొట్టిలతో అలంకరణ చేసుకోవటం ఉత్తమం. హాలులో సీలింగ్‌కు ఉండే బీమ్‌ కింద సోఫాలు, కుర్చీలు ఉంచండం మంచిది కాదు.

వెబ్దునియా పై చదవండి