చవకలో ఇంటిని అలంకరించుకోవడమెలా?

మీ దగ్గర సృజనాత్మకత కిలోల లెక్కన ఉందా... అలాగయితే ఖర్చుతో నిమిత్తం లేకుండా మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే చిట్కాలు మీ ముందు ఉంచుతున్నాము.

1. ముందుగా మీ ఇంటిని ఆసాంతం వీక్షించండి. కొత్తగా చేయవలసిన మార్పులు చేర్పులు ఏమిటనేది అవగతం చేసుకోండి. మీ లివింగ్ రూమ్ లేదా హాల్ పాతబడినట్లుగా కనిపిస్తున్నట్లయితే... చింతించవలసిన పని లేదు. ఫర్నీచర్‌లను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వేరే చోటుకు మార్చండి.
వేలాడుతున్న అలంకరణ వస్తువుల స్థానాలను మార్చండి లేదా సైడు టేబుళ్ళపై అమర్చండి. సోఫా కవర్లను, కుషన్ కువర్లను మార్చండి. ఇప్పుడు చూడండి. మీ గది ఎంత కొత్తగా కనపడతుందో...

2. ప్రకృతిని ఆరాధించే వారిలో మీరు ఒకరైతే... మీ ఇంటిని లేదా లివింగ్ రూమ్‌ను మొక్కలతో కూడిన కుండీలతో అలంకరించండి. అందమైన ఆ కుండీల కింద లైట్లు అమర్చండి. లైట్లు వెలుగగానే మొక్కల ఆకులపై పరావర్తనం చెందే కాంతి మీ గదికి నూతన శోభను తీసుకువస్తుంది.

3. మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్న సుగంధాలు వెదజల్లె అలంకృత క్యాండిల్స్‌ను మీ గదిలో ఉంచండి. వెలిగించగానే అవి వెదజల్లే పరిమళభరిత సుగంధ కాంతులతో మీ గదికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది.

4. వంటగదిని అలంకరించే ముందు గదిలో ఇంతకు ముందే ఉన్న అల్మారాలు, బల్లలు, టేబుళ్ళు తదితర సామాగ్రిని పారవేయకండి. పాత ఒక కొత్త అన్న సూక్తిని ఆధారంగా చేసుకుని వంటగది సామాగ్రిని తయారు చేసే కంపెనీలు పాత డిజైన్లలో కొత్త సామాగ్రిని మార్కెట్‌లోకి తెస్తున్నారు.
కనుక కాసింత సృజనాత్మకతను ఉపయోగించి మీ పాత సామాగ్రికి మెరుగులు దిద్దడం ద్వారా మీ వంటగదికి కొత్త రూపాన్ని తీసుకు రండి.

5. పలు రకాల ఆకారాలలో, డిజైన్లతో రూపొందిన అద్దాలతో మీ గదిని అలంకరించి గదికి మరింత అందాన్ని అద్దండి.

వెబ్దునియా పై చదవండి