పడకగదిలో లైటింగ్ ఎలా ఉండాలో తెలుసా?

శనివారం, 3 జనవరి 2015 (13:38 IST)
పడకగదిలో లైటింగ్ ఎలా ఉండాలో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. పడకగదిలో బెడ్‌కు దగ్గరగా లైట్‌ను అమర్చుకోవాలి. అలాగే పడకగదిలో లైటింగ్ ఇతర వస్తువుల మీద పడి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా అమర్చుకోకండి. ఫ్లోర్ ల్యాంప్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపిక చేసుకోకండి ఎందుకంటే ఇవి, ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేస్తాయి. వీటికి బదులుగా వాల్ ల్యాంప్స్‌ను ఎంపిక చేసుకోవాలి.  
 
అలాగే బెడ్ రూమ్ వాల్ పెయింట్ షేడ్స్ ఎంపిక చాలా అవసరం. పెయింట్ షేడ్స్ రాత్రుల్లో ప్రశాంతతను రిఫ్రెషెనెస్‌ను చేకూర్చాలి. పడగదికి తెలుపు, క్రీమ్ కలర్స్ చాలా ఉత్తమంగా ఉంటాయి. పడగదికి ఎప్పుడు కానీ డార్క్ కలర్స్ వేయించుకోకూడదు. అవి ఆ గదిని మరింత దగ్గరగా డార్క్‌గా చూపెడుతాయి.

వెబ్దునియా పై చదవండి