ఇల్లు కొంటున్నారా? ఫ్లాట్ కొంటున్నారా? కాస్త ఆగండి

గురువారం, 18 నవంబరు 2021 (19:30 IST)
సొంత ఇంటి కల గురించి వేరే చెప్పక్కర్లేదు. అద్దె జీవితాల నుంచి సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ఎందరో ఎదురుచూస్తుంటారు. కొందరు భవనిర్మాణదారులు చెప్పే స్కీంలకు గబుక్కున కొనేసి ఆ తర్వాత చిక్కుల్లో పడుతుంటారు. అందుకే ఇల్లు లేదా ఫ్లాట్ కొనే ముందు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి చెక్ చేసుకుని కొనుగోలు చేయాలి.

 
మీరు కొనే ఇంటి స్థలానికి, నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు వున్నాయేమో చూసుకోవాలి. స్థలం, భవనం డాక్యుమెంట్లన్నీ సరియైనవేనా లేదా అనేది న్యాయ సలహాదారు ద్వారా చెక్ చేయించుకోవాలి. నిర్మాణానికి వాడిన ఇటుక, సిమెంట్ ఇతర సామాగ్రి ఎక్కడి నుంచి తెప్పించారో కనుగొని వాటియొక్క నాణ్యతను తెలుసుకోవాలి.

 
ఇతర విషయాలు చూస్తే... నమ్మకమైన పనివాడిని కనుగొనాలి. మీ పొరుగువారు ఎలాంటి వారో తెలుసుకోండి. ఇంటికి సంబంధించి పునర్నిర్మాణ ప్రాజెక్టులతో మీ సమయాన్ని వెచ్చించండి. అన్ని గృహ వారెంటీలు, మాన్యువల్‌లను సురక్షితమైన స్థలంలో ఉంచాలి.

 
మీరు లోపలికి వెళ్లే ముందు మెయిన్ డోర్ తాళాలను మార్చండి. ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా మార్చండి. 
మీరు లోపలికి వెళ్లే ముందు ఇంటికి పెయింట్ చేయండి. ఇవన్నీ కొత్త ఇల్లు కొనుగోలు చేసేవారు తప్పకుండా అనుసరించాల్సినవి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు