దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఈ నేపథ్యంలో ఈ వాయు కాలుష్యంపై నమోదైన అఫిడవిట్‌లో సుప్రీం విచారణ చేపట్టింది.
కోవిడ్ మహమ్మారి వల్ల చాలా గ్యాప్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని తాము ఆదేశించలేమని సుప్రీంకు కేంద్రం వెల్లడించింది.
రహదారులపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు.. ప్రభుత్వ ఉద్యోగులు కార్‌పూలింగ్ చేయాలని సూచించినట్లు కేంద్రం చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడుతున్న వాహనాల సంఖ్య చాలా తక్కువ అని, వారి వాహనాలను నిలిపివేయడం వల్ల వాయు నాణ్యతలో ఎటువంటి మెరుగుదల ఉండదని కేంద్రం తెలిపింది.