ఇంట్లో దుర్వాసనను తట్టుకోలేకపోతున్నారా...?

గురువారం, 12 జులై 2018 (15:49 IST)
ఈ కాలంలో దుస్తులు ఒక పట్టాన ఆరవు. ఆరిన బట్టలను అల్మారాల్లో పెట్టినప్పుడు తడి వాసన వస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు ఇల్లంతా కూడా దుర్వాసన వస్తుంది. అలాంటి సమస్యలను పారదోలేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరి.
 
దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మజీవులను, ఫంగస్‌ను నిమ్మరసంలోని ఎసిటిక్ ఆమ్లం నిర్మూలిస్తుంది. అర బకెట్ నీటిలో రెండు చెంచాల నిమ్మరసం కలుపుకుని దుస్తులను అందులో ముంచి ఆరేయాలి. ఇలా చేయడం వలన బట్టల నుండి వచ్చే దుర్వాసనను తొలగించవచ్చును. అలాగే నిమ్మరసం కలుపుకున్న నీటితో గదులను కూడా తుడుచుకోవచ్చును.
 
వెనిగర్ కూడా ఫంగస్‌ను నిర్మూలించే శక్తిని కలిగి ఉంటుంది. ఇంట్లో దుర్వాసన వస్తుంటే వెనిగర్ కలిపిన నీటిని ఇల్లంతా చల్లుకోవాలి. ఆ తరువాత తుడిచుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. అలాకాకుంటే వంటసోడాలో కాస్త నీళ్లను కలుపుకుని దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో చల్లుకుంటే అలాంటి వాసనలు ఇకపై రావు. ఉప్పు తేమను ఎక్కువగా పీల్చేస్తుంది. దుర్వాసన సమస్యలన్నీ నివారిస్తుంది. జేబు రుమాలులో ఉప్పు వేసి మూటలా కట్టి దుర్వాసన వచ్చే చోట ఉంచితే చాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు