హాల్లో ఉన్న కర్టెన్ల మీద చున్నీలు లేదా అందమైన డిజైన్లు ఉన్న చీరల్ని అలంకరిస్తే హాల్‌కి స్పెషల్ లుక్ వస్తుంది. హాల్ గోడల మీద ఫోటోలకి బదులుగా మంచి సీనరిస్ ఉన్న వాల్ పోస్టర్లను ఉంచాలి. గోడల మీద పెయింట్ పోయినా, పగుళ్లు ఉన్నా వీటిని అతికిస్తే లోపాలు కలిపించవు. హాల్ అందంగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే హాల్లో ఎక్కువ వస్తువులు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల హాల్ విశాలంగా కనిపిస్తుంది.
చాలామంది ఏం చేస్తారంటే అతిథులు వచ్చినప్పుడు ముందుగా ఫ్యామిలీ ఆల్బమ్స్‌ని చూపిస్తుంటారు. అలాచేయకుండా మంచి విషయాలను మాట్లాడుకుంటే సంతోషంగా ఉంటుంది. అలా ఫోటోలు చూడడం వల్ల అతిథులతో మాట్లాడే అవకాశం దొరకదు. సంభాషణ ఎక్కువగా జరగడం వలన వాళ్ల గురించి మరి కొన్ని మంచి విషయాలను తెలుసుకోవచ్చు. మీరు చెప్పాల్సిన విషయాలను మాట్లాడవచ్చు అప్పుడే తెలియని వారు గురించి బాగా తెలుసుకోవచ్చు.