చామంతి, మల్లీ, బంతి పువ్వులు ఈ చలికాలంలో ఏ పండుగ వచ్చినా ఇంట్లో, ఆఫీసుల్లో తప్పకుండా కనిపిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే గులాబీ పువ్వులే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సీజన్‌లో ఇలాంటి పువ్వులు అధిక మోతాదులో పూస్తాయి. చలికాలంలో సువాసన వెదజల్లో పువ్వుల కోసం వెతుకుతున్నారా... అయితే ఈ చాయిస్‌కు తగ్గ పువ్వులు ఇవే...
స్వీట్ పీ పువ్వులు:
ఈ స్వీట్ పీ పువ్వులను ఇంట్లో, ఆఫీసుల్లో టేబుల్ మీద పెట్టుకుంటే చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి సువాసనను వెదజల్లి మీ మూడ్‌ను మార్చేస్తాయి. పెళ్లి ఇంట్లో అలంకరణ కోసం కూడా వీటిని వాడుకోవచ్చు. ఈ పువ్వులు ఎరుపు, తెలుపు, గులాబీ, వంకాయ రంగుల్లో పూస్తాయి.
అనిమోన్ పువ్వులు:
చలికాలంపో పుష్పించే పువ్వులలో అనిమోన్ పువ్వు ఒకటి. ఈ పువ్వులను నీళ్లు ఎక్కువగా అవసరమవుతాయి. ఒకసారి దీన్ని తెంపితే బొకేలలో వాడుకోవడానికి వీలుకాదు. ఈ పువ్వులు తెలుపు, ఎరుపు, వంకాయ, నీలం రంగుల్లో ఉంటాయి. వీటిని కేవలం టేబుల్ ట్యాప్ మీద మాత్రం అలంకరణగా ఉపయోగించవచ్చును.