అణ్వాయుధాలపై అల్‌ఖైదా, తాలిబాన్ల దృష్టి

అల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాదులు అణ్వాయుధాలు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టారని అమెరికా మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అల్ ఖైదా, తాలిబాన్ నాయకత్వాలు అణ్వాయుధాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలోనూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మైక్ ముల్లెన్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని వెల్లడించారు. తీవ్రవాద సంస్థలు, ముఖ్యంగా అల్ ఖైదా తీవ్రవాద సంస్థ అణ్వాయుధాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఈ తీవ్రవాద సంస్థలు ప్రజలను భయపెట్టేందుకు చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నాల్లో అణ్వాయుధాల సేకరణ కూడా ఒకటని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి