ఉత్తర కొరియా ప్రభుత్వ కూల్చివేతకు అమెరికా కుట్ర!

సోమవారం, 2 నవంబరు 2009 (09:57 IST)
ఉత్తర కొరియా ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు అమెరికా కుట్రపన్నుతోంది. ఈ విషయాన్ని సియోల్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ యోన్హాప్ వార్తా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. "ఆపరేషన్ల్ ప్లాన్ ( ఓప్లాన్) 5029" పేరుతో రచించిన ఈ కుట్ర ప్రణాళికకు అమెరికా, దాని మిత్రదేశం దక్షిణ కొరియా అగ్రనేతలు ఆమోదం వేసినట్టు సమాచారం.

ఈ కుట్రలో భాగంగా.. ఉత్తర కొరియాలో అంతర్యుద్ధాన్ని రేకెత్తించటంతో పాటు బయటి నుంచి ఆయుధాలను సరఫరా చేయటం, ఆ దేశంపైకి భారీయెత్తున శరణార్ధులను పంపటం వంటి చర్యలు చేపడతారని ఈ వార్తాసంస్థ పేర్కొంది. ఉత్తర కొరియాలో జనహనన మారణాయుధాలు ఉన్నట్టు అమెరికా ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తోంది. దీన్ని అడ్డుపెట్టుకుని దక్షిణ కొరియా సహకారంతో ఉత్తర కొరియాను తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా నిర్ణయించినట్టు ఆ పత్రిక పేర్కొంది.

అయితే, ఈ కథనంపై స్పందించేందుకు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు. అయితే తమపైకి దురాక్రమణ చేసేందుకు అమెరికా, దక్షిణ కొరియాతో కలిసి పన్నుతున్న కుట్రపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. గతంలో కూడా అమెరికా, దక్షిణ కొరియాలు ఇలాంటి పథకాలు వేశాయి. అయితే అవి తమ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమిస్తాయనే భయం దక్షిణ కొరియాకు ఉందని అందవల్ల ఆ పథకాన్ని అమలు చేయలేదని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి