ఐఎస్‌ఐ ఛీఫ్‌గా మాజీ క్రికెటర్ పటౌడీ బంధువు

పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ పదవిని కొత్త వ్యక్తి చేపట్టే అవకాశం ఉంది. ఇస్లామాబాద్‌కు సమీపంలోనే లాడెన్ నివసిస్తున్నప్పటికీ గుర్తించడంలో ఐఎస్ఐ విఫలమవడంతో ప్రస్తుత ఛీఫ్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షూజా పాషాను ఆ పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పాషా పదవీ కాలం ఇటీవలే రెండు సంవత్సరాల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. లాడెన్ మృతితో పాషా పదవికి గండం ఏర్పడింది. ఐఎస్ఐపై పాకిస్థాన్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమర్శలు వస్తున్నాయి. షాఫాను తొలగించే పక్షంలో ఈ పదవీ రేసులో మాజీ భారత కెప్టెన్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడి సమీప బంధువు అయిన మేజర్ జనరల్ ఇస్ఫాన్దియార్ అలీ పటౌడి ముందున్నారు.

ఇస్ఫాన్దియార్ తండ్రి మేజర్ జనరల్ నవాబ్జాదా మొహమ్మద్ అలీ పటౌడీ మన్సూర్ అలీ ఖాన్ తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్‌కి తమ్ముడు. దేశ విభజన జరిగిన సమయంలో మేజర్ జనరల్ నవాబ్జాదా మొహమ్మద్ పాకిస్థాన్‌లో ఉండి ఆ దేశ సైన్యంలో చేరాలని నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి