గాంధీజీపై పుస్తకం రాయాలని ఉంది: బ్రౌన్

ఆదివారం, 2 ఆగస్టు 2009 (15:08 IST)
ఈ శతాబ్దపు మహనీయుల్లో ఒకరైన భారత జాతిపిత మహాత్మా గాంధీ శాంతి ప్రవచనాలపై పుస్తకం రాయాలని ఉందని బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళికి గాంధీజీ ప్రసాదించిన శాంతితత్వంపై తనకు రచనలు చేయాలనే ఆసక్తి కలుగుతోందన్నారు. ఎలాంటి పదవీకాంక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందన్నారు.

ముఖ్యంగా, అహింసాయుత పద్దతుల ద్వారా స్వాతంత్ర్య పోరాటం చేయడం వినూత్నమని బ్రౌన్ కొనియాడారు. 21వ శతాబ్దిలో భారత్ అత్యంత కీలకం కానుందన్నారు. ఇప్పటికే అభివృద్ధిలో ప్రపంచ అగ్రదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ కీలకమైన పాత్ర పోషించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి