పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థ రసాయనాల కంటే గృహావసరాల నిమిత్తం వాడి వదిలివేసే వ్యర్థాల నుంచి వచ్చే పదార్థాలు అత్యంత ప్రమాదకరంగా తయారవుతున్నాయని రష్యాలోని ఓ అధ్యయన సంస్థ పేర్కొంది.
దీనిపై సర్వే చేసిన రష్యా ప్రజా అభిప్రాయాల అధ్యయన సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 42 ప్రాంతాల్లో చేసిన ఈ సర్వేలో 1600 మంది యువకులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో స్పందించిన 51 శాతం మంది గృహావసరాల నిమిత్తం వాడి వదిలివేసే వ్యర్థాల నుంచి వచ్చే పదార్థాలు, వీధుల్లోని చెత్త చెదారాలు ప్రపంచంలోని పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమని చెప్పారు.
37 శాతం మంది చెత్తను నిల్వచేయడం, రవాణా చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని పేర్కొన్నట్లు తెలిపారు. 10శాంత మంది ముడి పదార్ధాలను వేడి చేయడం వల్ల , ఉడికించడం వల్లన, 12 శాతం మంది పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థాల వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని సర్వేలో పాల్గొన్న వ్యక్తులు తెలిపినట్లు సమాచారం.