తైవాన్‌కు అమెరికా ఆయుధాలు: చైనా ఖండన

తైవాన్‌కు అమెరికా ఆయుధాలను విక్రయిస్తోంది. దీని చైనా తీవ్రంగా ఖండించింది. ఈ చర్య చైనా అంతర్గత వ్యవహారాల్లోకి అమెరికా జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడింది. ఈ వ్యవహారం వల్ల అమెరికాతో తమ సంబంధాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది.

అమెరికాకు చెందిన రేతియాన్‌ కంపెనీ తైవాన్‌ నుంచి 110 కోట్ల డాలర్ల ఆర్డర్‌ను ఇటీవల అందుకుంది. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ తైవాన్‌కు పేట్రియాట్‌ క్షిపణులను అమ్మే ఒప్పందం కుదుర్చుకోవడాన్ని చైనా గత గురువారం ఖండించింది.

వెబ్దునియా పై చదవండి