త్వరలో స్వదేశానికి తిరిగి వస్తా: యెమెన్ అధ్యక్షుడు సలేహ్

యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లాహ్ సలేహ్‌‌ తాను త్వరలో స్వదేశానికి తిరిగి వచ్చి అధ్యక్ష ఎన్నికలను త్వరగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. యెమెన్ రాజధాని సనా‌లోని అధ్యక్ష భవన సముదాయంపై జూన్‌‌లో జరిగిన దాడిలో గాయపడి సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్న సలేహ్ త్వరగా కోలుకుంటున్నారని సలేహ్ ప్రతినిధి వెల్లడించారు.

సలేహ్ యెమెన్‌కు తిరిగి వెళ్తే పౌర యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉన్నందున ఆయన సౌదీ అరేబియాలో ఉండాలని అమెరికా, సౌదీ అరేబియా పాలకులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే సలేహ్ మంగళవారం తాను స్వదేశానికి తిరిగివస్తానని తన మద్దతుదారులకు టెలివిజన్‌ ద్వారా చెప్పారు. ప్రతిపక్షం సాయుధ గిరజన పోరాటయోధులను వెనక్కుతీసుకొని వీధుల్లో ర్యాలీలకు స్వస్తి పలికినట్లయితే ఉపాధ్యక్షుడికి అధికార మార్పిడి చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు సలేహ్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి