నా ఆరోగ్యం భేషుగ్గానే ఉంది: వెనిజులు అధ్యక్షుడు

ఇటీవల రెండో సారి కీమోథెరపీ చేయించుకున్న వెనిజులా అధ్యక్షుడ హ్యూగో ఛావెజ్ ఆరోగ్యం బాగా ఉంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన తాజాగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూబాలో రెండో విడత కీమోథెరపీ చేయించుకున్న అనంతరం తన ఆరోగ్యం ఇప్పుడు బాగా మెరుగుపడుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు తాను ఐదు గంటలపాటు నిలబడి ఉపన్యసించగల స్థితిలో ఉన్నట్లు తెలిపారు.

తాను చేయించుకున్న కీమోథెరిపీ వల్ల ఎలాంటి ప్రమాదం ఉత్పన్నం కాబోదన్నారు. నాకు మెటాస్టాటిస్‌ (కేన్సర్‌ ఇతర అవయవాలకు విస్తరించడం) లేదన్నారు. తనకు కేన్సర్‌ ఉన్నట్లు గుర్తించినప్పటి నుంచీ ఆరోగ్యం పట్ల తాను అత్యంత శ్రద్ధగా ఉంటున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి