పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న బ్రౌన్!

ఆదివారం, 27 డిశెంబరు 2009 (11:30 IST)
జోడు పదవులను అనుభవిస్తున్న బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్ పార్టీ పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. కొత్త సంవత్సరం ఆరంభంలో లేబర్ పార్టీ నేత బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకూ ప్రధానిగా కొనసాగాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం.

పార్టీ పదవి నుంచి వైదొలగాలని కొందరు సీనియర్ మంత్రులు బ్రౌన్‌కు సూచన చేశారు. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు డైలీ ఎక్స్‌ప్రెస్‌ దిన పత్రిక శనివారం ఓ వార్తా కథనం ప్రచురించింది.

ఇదే నిజమైతే జనవరిలోనే బ్రౌన్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఫ్రిబ్రవరిలో జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఆయన స్థానంలో సీనియర్‌ నేతలు డేవిడ్‌ కెమెరాన్‌, నిక్‌ క్లెగ్గ్‌ పేర్లు పార్టీ నేత పదవికి పరిశీలనలో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి