బైతుల్లా మృతి: వంద శాంత నమ్మలేం: యూఎస్

శనివారం, 8 ఆగస్టు 2009 (19:30 IST)
పాకిస్థాన్ మోస్ట్ వాంటెండ్ తీవ్రవాది, ఆ దేశంలో తాలిబాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మసూద్ మృతిని తాము వందశాతం నమ్మలేమని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ అన్నారు. బైతుల్లా మృతిపై మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నాం. ఈ వార్తలను వంద శాతం నమ్మేదుకు మేం నిర్థారించుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

ఒకవేళ మసూద్ మృతి చెందిన వార్తలను నిజమైతే పాకిస్థాన్ ప్రజలు సురక్షితులేనన్నారు. ఇదిలావుండగా, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ మాత్రం నిఘా వర్గాల సమాచారం మేరకు బైతుల్లా మరణించినట్టు ధృవీకరించారు. అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో బైతుల్లా మరణించినట్టు చెప్పారు. బైతుల్లా మృతిని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి