బ్రిటన్ వ్యూహాత్మక ప్రదేశాలకు తీవ్రవాద ముప్పు

బ్రిటన్‌కు చెందిన వ్యూహాత్మక మిలటరీ ప్రదేశాలకు తీవ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని ఆ దేశ భద్రతా దళాల ఉన్నతాధికారులు హెచ్చరించారు. అణు రక్షణ ప్రధాన కేంద్రంతోపాటు, కీలకమైన మిలటరీ ప్రదేశాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని అధికారులు పేర్కొన్నారు. తీవ్రవాదులు గూగుల్ ఎర్త్ సాయంతో ఈ ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉంది.

స్కాంట్లాండ్‌లోని ఫాస్లేన్‌లో ఉన్న రహస్య నావికా దళ స్థావరంతోపాటు, ఇతర సున్నితమైన మిలటరీ ప్రదేశాలు గూగుల్ ఎర్త్ ద్వారా ఇంటర్నెట్‌లో వీక్షించవచ్చు. రెండు భారీ వాన్‌గార్డ్ క్లాస్ జలాంతర్గాములును స్పష్టంగా చూడవచ్చు. ఈ జలాంతర్గాములకు 16 అణు క్షిపణులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగివున్నాయి.

అంతేకాకుండా అణ్వాయుధాలు భద్రతపరిచే ట్రైడెంట్ స్పెషల్ ఏరియా కూడా గూగుల్ ఎర్త్‌లో వీక్షణకు అందుబాటులో ఉండటం బ్రిటన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్ అణు రక్షణ ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదులు గూగుల్ ఎర్త్ సాయంతో మోర్టార్ లేదా రాకెట్ దాడులు చేయడం సులభతరం అవుతుందని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేశారు. వారికి సున్నితమైన మిలటరీ స్థావరాలు స్పష్టంగా తెలిస్తే, దాడులు చేయడం సులభం అవుతుందని అధికారులు చెప్పినట్లుగా ది సన్ పత్రిక వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి