భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన చైనా

మంగళవారం, 10 నవంబరు 2009 (21:33 IST)
దలైలామా భారత్‌లోని అరుణాచలప్రదేశ్‌లో పర్యటించేందుకు భారతదేశం అనుమతించిన విషయాన్ని చైనా తప్పుబట్టింది.

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువైన దలైలామా అరుణాచలప్రదేశ్‌లో పర్యటించడంతో చైనా దేశం భారత్‌‍పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి కిన్ గాంగ్ అన్నారు.

దలైలామా అరుణాచలప్రదేశ్‌లో పర్యటించడాన్ని తాము గతంలోనే అభ్యంతరం తెలిపినా కూడా భారతదేశం అనుమతినిచ్చిందని, దీనిపై తమకు ఎన్నో అభ్యంతరాలున్నాయని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా దలైలామా మూడు రోజుల క్రితం అరుణాచలప్రదేశ్‌లోని తవాంగ్‌లో పర్యటించారు. కాగా అరుణాచలప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమైనందున తమ అతిథికి దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని భారత్ ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి