భారత అభివృద్ధికి తోడ్పడండి: ప్రతిభాపాటిల్

FILE
బ్రిటన్ పర్యటన నిమిత్తం వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ ఇటీవల నోబెల్ పురస్కార గ్రహీత వి.రామకృష్ణన్‌తోపాటు ఇతర ప్రవాస భారతీయులు కలిసి భారతదేశంలో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని ఆమె వారికి సూచించారు.

బ్రిటన్‌లో భారత దౌత్యాధికారి రాష్ట్రపతికి గౌరవార్థం ఇచ్చిన విందులో పాటిల్‌తోపాటు ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తూ... భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని, దీనికి ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడు కలిసి ముందుకు రావాలని వారికి ఆమె పిలుపునిచ్చారు.

విదేశాలలోవున్న ప్రవాస భారతీయులు తమ దేశాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పాటునందిస్తారని తాను ఆశిస్తున్నాని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇదిలావుండగా గడచిన ఇరవై సంవత్సరాలలో భారతదేశపు రాష్ట్రపతి బ్రిటన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

కాగా బ్రిటన్‌లోని మ్యారియేట్ లగ్జరీ హోటల్‌లో నిర్వహించిన ఈ విందు భోజన కార్యక్రమంలో లార్డ్ స్వరాజ్ పాల్, "కరీ కింగ్" గులామ్ నూన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్‌పి. హిందుజా, నాథ్ పురి, జోగిందర్ సాంగర్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి