భారత సరిహద్దులను ఉల్లంఘించలేదు: చైనా

భారత్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును తమ దళాలు ఉల్లంఘించాయని వస్తున్న ఆరోపణలను చైనా ప్రభుత్వం తోసిపుచ్చింది. జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని లడక్ ప్రాంతంలో చైనా దళాలు భారత భూ సరిహద్దును ఉల్లంఘించి 1.5 కిలోమీటర్ల మేర సరిహద్దులోపలికి చొచ్చుకొచ్చాయని ఆర్మీ అధికారులు వెల్లడించినట్లు ఆదివారం మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆ ప్రాంతమంతా చైనా దళాలు ఆ దేశం పేరును రాళ్లపై, గుట్లపై ఎరుపు పెయింట్‌‌తో రాశాయని సరిహద్దు భద్రతా దళ సిబ్బంది జులై 31న గుర్తించారని భారత మీడియా పేర్కొంది. ఈ వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. భారత భూభాగంలోకి తమ ఆర్మీ చొరబడలేదని స్పష్టం చేసింది. ఇవి నిరాధారమైన వార్తలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. చర్చల ద్వారా సరిహద్దు సమస్యకు స్నేహపూరిత పరిష్కారాన్ని కనుగొంటామని తెలిపింది.

చైనా, భారత్‌లు అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించిన చుమర్ సెక్టార్‌లోని మౌంట్ గ్యా సమీపంలో చైనా దళాలు సరిహద్దును అతిక్రమించి 1.5 కిలోమీటర్ల మేర లోపలికి వచ్చాయని అధికారిక వర్గాలు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా చైనా పేరును ఈ ప్రాంతమంతా రాళ్లు, గుట్టలపై ఎర్రటి స్ప్రే పెయింట్‌తో రాశారని భారత మీడియా వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి