మా పోరాటం అల్‌ఖైదాతోనే: అమెరికా

మా పోరాటం కేవలం అల్‌ఖైదాతోనేనని, పాకిస్థాన్‌ లేదా ఇతర ముస్లిం దేశాలతో కాదని అమెరికా స్పష్టం చేసింది.

ఉగ్రవాదంపై పోరు, జీహాదీలతో యుద్ధం, గ్లోబల్ వార్‌లాంటి పదాలను భవిష్యత్తులో ఇకపై వాడకూడదని నిర్ణయించింది. మా పోరాటం కేవలం అల్‌ఖైదా తీవ్రవాద సంస్థతోనేనని, ముస్లిం దేశాలతో కాదని ఆ దేశ తీవ్రవాద నిరోధకవిభాగ అధికారి జాన్ బ్రెన్నన్ తెలిపారు.

మా పోరాటం, మా ఆలోచనలు ఇకపై కేవలం 'అల్‌ఖైదాతో యుద్ధం' అనే భావనతో మాత్రమే ఉంటుందన్నారు. ఖురాన్ ప్రకారం "జీహాద్" అంటే ఓ నైతిక లక్ష్య సాధన కోసం జరిపే పవిత్ర పోరని ఆయన తెలిపారు.

కాబట్టి గ్లోబల్‌ వార్ అనే పదం ఉపయోగిస్తే అది అల్‌ఖైదా సమర్థతను పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని కాబట్టి ఇకపై అలాంటి పదాలను ఉపయోగించకూడదని తాము భావిస్తున్నట్లు బ్రెన్నన్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి