మోసపూరిత విద్యా సంస్థలపై కృష్ణ ఆందోళన

భారతీయ విద్యార్థుల జీవితాలతో ఆస్ట్రేలియాలోని మోసపూరిత విద్యా సంస్థలు చెలగాటమాడుకుంటున్నాయని భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎస్ఎం కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటువంటి విద్యా సంస్థల ఆటకట్టించాలని కోరారు. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుకోకుండా చూసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురావాలన్నారు.

ఆస్ట్రేలియాలో వరుసగా జరుగుతున్న శారీరక దాడులతోపాటు, కోర్సుల్లో నాణ్యతా లోపాలు, అనేక వృత్తివిద్యా కళాశాలలు అందిస్తున్న సేవలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని ఎస్ఎం కృష్ణ తెలిపారు.

కొన్ని వృత్తివిద్యా కళాశాలలు ఆస్ట్రేలియాకు చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, తమ విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయని ది ఆస్ట్రేలియన్ వార్తాపత్రికతో భారత విదేశాంగ మంత్రి చెప్పారు. ప్రైవేట్ కళాశాలలకు కొత్త నిబంధనలను తీసుకురావాలని ఎస్ఎం కృష్ణ ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి